డెంగ్యూ పరీక్షల్లో సీతంపేట సీహెచ్‌సీకి గుర్తింపు

ABN , First Publish Date - 2021-10-15T05:00:59+05:30 IST

డెంగ్యూ పరీక్షల నిర్వహణలో సీతంపేట సీహెచ్‌సీ రాష్ట్రంలోనే రెండో స్థానం సాధించి గుర్తింపు పొందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డిప్యూటీ డీఎమ్‌అండ్‌హెచ్‌వో నరేష్‌కుమార్‌ తెలిపారు.

డెంగ్యూ పరీక్షల్లో సీతంపేట సీహెచ్‌సీకి గుర్తింపు


సీతంపేట: డెంగ్యూ పరీక్షల నిర్వహణలో సీతంపేట సీహెచ్‌సీ రాష్ట్రంలోనే రెండో స్థానం సాధించి గుర్తింపు పొందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డిప్యూటీ డీఎమ్‌అండ్‌హెచ్‌వో నరేష్‌కుమార్‌ తెలిపారు. గురువారం  ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌తో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 డెంగ్యూ పాజిటివ్‌ కేసులకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందజేయడంతో  గుర్తింపు లభించిందని చెప్పారు. కొత్తూరు సీహెచ్‌సీలో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడం అక్కడ  డిప్యూటేషన్‌ఫై పనిచేస్తున్నారని తెలిపా రు. రెగ్యులర్‌ వైద్యాధికారులను నియమించాలని కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.



Updated Date - 2021-10-15T05:00:59+05:30 IST