లోక్‌అదాలత్‌ ద్వారా సమన్యాయం

ABN , First Publish Date - 2021-12-08T04:53:17+05:30 IST

లోక్‌అదాలత్‌ ద్వారా ఇరువర్గాల వారికి సత్వర, సమ న్యాయం జరుగుతుందని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి పేర్కొన్నారు.

లోక్‌అదాలత్‌ ద్వారా సమన్యాయం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి

సంగారెడ్డి క్రైం, డిసెంబరు 7: లోక్‌అదాలత్‌ ద్వారా ఇరువర్గాల వారికి సత్వర, సమ న్యాయం జరుగుతుందని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11న  జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. పెండింగ్‌ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించి అవార్డు జారీ చేస్తారని వివరించారు. ఇక ఇతర పై కోర్టులకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం కూడా ఉండదని తెలిపారు. జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతం కోసం వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు. సమావేశంలో జిల్లా 7వ అదనపు జడ్జి ఎ.కర్ణకుమార్‌, జిల్లా న్యాయ   సేవాధికారసంస్థ కార్యదర్శి  ఆశాలత పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:53:17+05:30 IST