రికార్డు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-06-06T10:19:13+05:30 IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయంలో జడ్చర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే టాప్‌లో

రికార్డు బ్రేక్‌

జడర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి భారీ ఆదాయం

టార్గెట్‌కు 140 శాతం అదనం


జడ్చర్ల, జూన్‌ 5 : స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయంలో జడ్చర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే టాప్‌లో నిలిచింది. 2019-20 సంవత్సరానికి రూ.33 కోట్ల టార్గెట్‌ నిర్దేశించగా, రూ.46,36,32,358 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో టార్గెట్‌కు 140 శాతం అదనంగా ఆదాయం వచ్చింది.


ఈ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, భూత్పుర్‌, మూసాపేట, మిడ్జిల్‌ మండలాలు ఉండగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగడంతో లక్ష్యానికి మించి ఆదాయం లభించింది. 2018-19 సంవత్సరంలో 27,499 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌ కాగా, తాజాగా 29,934 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌ అయినట్లు రిజిస్ట్రార్‌ జగన్‌మోహన్‌రాజు శుక్రవారం తెలిపారు.

Updated Date - 2020-06-06T10:19:13+05:30 IST