రికార్డ్... గరిష్టాన్ని తాకిన పెట్రో ధరలు...

ABN , First Publish Date - 2021-06-21T20:45:22+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిలో గరిష్టాన్ని తాకాయి.

రికార్డ్... గరిష్టాన్ని తాకిన పెట్రో ధరలు...

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిలో  గరిష్టాన్ని తాకాయి. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటింది. డీజిల్ ధర పలుచోట్ల రూ. 100 చేరుకుంది. శ్రీగంగానగర్ సహా ప్రాంతాల్లో లీటర్ డీజిల్ రూ. 100 దాటింది.


దేశీయ చమురు సంస్థలు... ప్రతీరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌కు అణుగుణంగా ఈ సవరణ ఉంటుంది. కాగా... మొత్తం 48 రోజుల్లో 27 సార్లు పెట్రో ధరల పెంపు చోటుచేసుకుంది. కాగా... ఈ రోజు(జూన్ 21, సోమవారం) ధరలో మాత్రం ఎలాంటి  మార్పూ లేదు. మే 4 నుండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు 27 సార్లు పెరిగాయి. కేవలం ఒక్క మే నెలలోనే 16 సార్లు పెరిగింది.


ఇక... మే 4వ తేదీ నుండి ఈ 48 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్ పై రూ. 6.82, లీటర్ డీజిల్ పైన రూ. 7.24 పెరిగింది. ముంబై, రత్నగిరి, పర్బానీ, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, ఇడోర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, చిక్‌మగళూరు, లేహ్ తదితర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ. 100 దాటింది. పెట్రోల్ ధర నిన్న 29 పైసలు, డీజిల్ 28 పైసలు పెరిగింది. 

Updated Date - 2021-06-21T20:45:22+05:30 IST