నెలరోజులైన రికార్డులు అప్పగించలేదు

ABN , First Publish Date - 2021-06-14T05:26:44+05:30 IST

వలేటివారిపాలెం పంచాయతీ కార్యదర్శిగా స్వాతి విదుల్లో చేరి నెలన్నర రోజులైనా ఇన్‌చార్జీ పంచాయతీ కార్యదర్శి అబ్దుల్‌బారి ఇప్పటి వరకూ ఆమెకు రికార్డులు అప్పగించలేదు.

నెలరోజులైన రికార్డులు అప్పగించలేదు
వలేటివారిపాలెం పంచాయతీ కార్యాలయం

వలేటివారిపాలెం పంచాయతీ కార్యదర్శి స్వాతి ఆవేదన

వలేటివారిపాలెం, జూన్‌ 13 : వలేటివారిపాలెం పంచాయతీ కార్యదర్శిగా స్వాతి విదుల్లో చేరి నెలన్నర రోజులైనా ఇన్‌చార్జీ పంచాయతీ కార్యదర్శి అబ్దుల్‌బారి ఇప్పటి వరకూ ఆమెకు రికార్డులు అప్పగించలేదు. దీంతో పాలన కుంటు పడుతోంది. పంచాయతీ రికార్డులు అప్పగించమని స్వాతి  ఇన్‌చార్జ్‌ పంచాయతీ కార్యదర్శి అబ్దుల్‌బారిని అడిగినా స్పందించలేదని ఆమె వాపోయింది. అంతేగాకుండా పలుమార్లు పంచాయతీ విస్తరణాధికారికి, ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. అయినప్పటికీ పలితం లేదని ఆమె పేర్కొన్నారు. వలేటివారిపాలెం ఇన్‌చార్జ్‌ పంచాయతీ కార్యదర్శిగా పోకూరు పంచాయతీ కార్యదర్శి అబ్దుల్‌బారి విధులు నిర్వహించే వారు. అయితే రెండు నెలల క్రితం వలేటివారిపాలెంకు రెగ్యులర్‌ పంచాయతీ కార్యదర్శిగా స్వాతిని నియమించారు. ఆమె నెలన్నర క్రితం విదుల్లో చేరింది అప్పటి నుంచి ఇన్‌చార్జ్‌ కార్యదర్శి అబ్దుల్‌బారి రికార్డులు అప్పగించలేదు. పంచాయతీల్లో 24 రకాల రికార్డులు ఉంటాయి. వాటిలో ఇటీవల ఇంటి పన్నులు వసూలు చేసేందుకు ఇంటిపన్ను అసె్‌సమెంటు రికార్డు మాత్రమే అప్పగించారు. మిగిలిన 23 రకాల రికార్డులు అప్పగించలేదు. దీంతో వలేటివారిపాలెంలో పాలన కుంటుపడుతోంది. ఇప్పటికైనా ఉన్న పంచాయతీ కార్యదర్శికి రికార్డులు అప్పగిస్తే విధులు సక్రమంగా జరిగే అవకాశం ఉంది. నెలన్నర క్రితం ఈవోపీఆర్‌డీ సదరు ఇన్‌చార్జ్‌ పంచాయతీ కార్యదర్శికి నోటీసు ఇచ్చినా స్పందించకపోవడం గమనార్హం.

నోటీసు ఇచ్చినా స్పందించలేదు

వలేటివారిపాలెం పంచాయతీ కార్యదర్శి స్వాతికి  రికార్డులు అప్పగించమని గత నెల 1న పోకూరు పంచాయతీ కార్యదర్శి అబ్దుల్‌బారికి నోటీసు జారీ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పంచాయతీ రికార్డులు అప్పగించలేదు. ఇటీవల ఇంటిపన్ను అసె్‌సమెంట్‌ రికార్డు మాత్రమే అప్పగించారు. మిగిలిన 23 రకాల రికార్డులు అప్పగించాల్సి ఉంది. పంచాయతీ రికార్డులు అప్పగించేలా చర్యలు చేపడతా. సుమంత్‌ - పంచాయతీ విస్తరణాధికారి

Updated Date - 2021-06-14T05:26:44+05:30 IST