రికార్డులు పూర్తిస్థాయిలో ఉండాలి

ABN , First Publish Date - 2021-11-30T05:18:56+05:30 IST

ప్రతి పనికి రికార్డులు పూర్తిస్థాయిలో ఉం డాలని డ్వామా అడిషనల్‌ పీడీ మద్దిలేటి సిబ్బందిని ఆదేశించారు.

రికార్డులు పూర్తిస్థాయిలో ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

వల్లూరు, నవంబరు 29 : ప్రతి పనికి రికార్డులు పూర్తిస్థాయిలో ఉం డాలని డ్వామా అడిషనల్‌ పీడీ మద్దిలేటి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం 2019-20, 2020-21 సంవత్సరంలో వల్లూరు మండలంలో ఉపాధి కింద చేపట్టిన పనులను సామాజిక తనిఖీ బృందం గత వారం రోజులుగా ఆయా గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. ఇందులో భాగంగా సోమవారం మండల కాంప్లెక్స్‌లో ఓపెన్‌ ఫోరమ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్‌ పీడీ హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఖర్చుపెట్టిన రూ.8 కోట్ల 49 లక్షల పనుల్లో (రెండు సంవత్సరాలకు గాను) అక్కడక్కడా జరిగిన చిన్న చిన్న పొరపాట్లను తనిఖీ బృందం పరిశీలించారు. వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. రూ.27590 రికవరీ చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో ఎవరు పని అడిగినా సత్వరమే కల్పించాల్సిన బాధ్యత ఉపాధి సిబ్బందిపై ఉందన్నారు.రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమలాపురం క్లస్టర్‌ ఏపీడీ సోమశేఖర్‌రెడ్డి, డ్వామా డీవీఓ యోగాంజనేయరెడ్డి, ఎంపీడీఓ జుబేదా, ఉపాధి అంబూర్స్‌మెంట్‌ శాంభవివారెడ్డి, శ్రీనివాసులు, ఎస్‌ఆర్‌పీ విజయభాస్కర్‌, మా జీ జెడ్పీటీసీ వీరారెడ్డి, క్వాలిటీ కంట్రోల్‌ అధికారి చంద్రశేఖర్‌, మండల ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T05:18:56+05:30 IST