మెరుగైన నియామకాలు

ABN , First Publish Date - 2020-08-13T06:07:28+05:30 IST

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతోపాటు కీలక పరిశ్రమలు మళ్లీ తెరుచుకుంటుండటంతో ఉద్యోగ నియామకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ నౌకరీ...

మెరుగైన నియామకాలు

  • జూలైలో 5శాతం వృద్ధి

ముంబై: లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతోపాటు కీలక పరిశ్రమలు మళ్లీ తెరుచుకుంటుండటంతో ఉద్యోగ నియామకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ నౌకరీ. కామ్‌ వెల్లడించింది. నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ ప్రకారం.. జూన్‌తో పోలిస్తే జూలైలో నియామకాలు 5 శాతం పెరిగాయి. జూన్‌లో కంపెనీ వెబ్‌సైట్‌లో 1,208 కొత్త ఉద్యోగ పోస్టింగ్స్‌ నమోదుకాగా.. జూలైలో ఈ సంఖ్య 1,263కు పెరిగింది. గత ఏడాది జూలైతో పోలిస్తే మాత్రం గత నెలకు నియామకాలు 47 శాతం తగ్గాయని నౌకరీ తెలిపింది. గతనెలలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్‌, ట్రావెల్‌ రంగాల్లో హైరింగ్‌ వార్షిక ప్రాతిపదికన 80 శాతం తగ్గింది. రిటైల్‌లో 71 శాతం, రియల్‌ ఎస్టేట్‌లో 60 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌లో 58 శాతం తగ్గాయి. 


Updated Date - 2020-08-13T06:07:28+05:30 IST