రెడ్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2021-07-25T04:13:51+05:30 IST

మహారాష్ట, కర్ణాటక రాష్ర్టాల్లో కురు స్తున్న భారీ వర్షాలకు ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టు లకు భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

రెడ్‌ అలర్ట్‌
కృష్ణానది తీరాన పోలీసుల బందోబస్తు

- కృష్ణానదికి 1.75 లక్షల క్యూసెక్కుల వరద

- నదీ తీర గ్రామాల్లో అప్రమత్తం


కృష్ణా, జులై 24 : మహారాష్ట, కర్ణాటక రాష్ర్టాల్లో కురు స్తున్న భారీ వర్షాలకు ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టు లకు భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శుక్రవారం ఉదయం దిగువకు నీటిని విడుదల చే యడంతో కృష్ణా, భీమా నదులకు వరద వస్తోంది. శని వారం ఉదయం వరకు దాదాపు 1.75 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో కృష్ణానది, భీమా సంగమ క్షేత్రాలై న నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో కృష్ణమ్మ ఉ గ్రరూపం దాల్చింది. దీంతో పోలీస్‌, రెవెన్యూ శాఖలు అ ప్రమత్తమయ్యాయి. నదీ తీర ప్రాంతాల్లో చాటింపు వే యించారు. సుకుర్‌లింగంపల్లి, తంగడిగి, కుసుమూర్తి, కృ ష్ణా, హిందూపూర్‌, వాసునగర్‌, ముడుమాల్‌ గ్రామాల న ది ఒడ్డున పోలీసులు, రెవెన్యూ అధికారులు పరహా కా స్తున్నట్లు తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, ఎస్‌ఐ మురళి తెలి పారు. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు, బోట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. నదికి వరద ఎక్కువగా వస్తే ముంపు ప్రాంతాల ప్రజలను సు రక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసి నట్లు వారు వివరించారు.

Updated Date - 2021-07-25T04:13:51+05:30 IST