మామిడాడలో ‘రెడ్‌’ అలర్ట్‌!

ABN , First Publish Date - 2020-05-23T11:13:01+05:30 IST

మామిడాడలో ‘రెడ్‌’ అలర్ట్‌!

మామిడాడలో ‘రెడ్‌’ అలర్ట్‌!

పెదపూడి/పెదపూడి (జీ మామిడాడ): మండలంలో జీ మామిడాడకు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో స్థానిక మండలంలోని పలు గ్రామాల్లో కలకలం రేగింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జీ మామిడాడ, పరిసర గ్రామాల్లో పరిస్థితి ఆరా తీయడానికి శుక్రవారం కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి వచ్చారు. సాధారణ పరిస్థితికి వచ్చేవరకు జి మామిడాడను ఆయన రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణతో కలిసి చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్థానికులకు చేస్తున్న శ్వాబ్‌ పరీక్షల తీరు పరిశీలించారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో, సమీప ప్రాంతాల్లో ఎవరికి ఎటువంటి జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్నా స్వచ్చందంగా పరీక్షలు చేయించుకుంటే మంచిదన్నారు. అనుమానిత లక్షణాలున్న వారు ఆత్మన్యూనత భావంతో వెనకంజ వేస్తే తర్వాత ఇబ్బంది పడతారన్నారు. ప్రజలంతా సహకరించా లని, అందరికీ శ్వాబ్‌ పరీక్షలు పూర్తి చేస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే కొందరిని కాకినాడ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించామని, వైద్యుల పర్యవేక్షణలో వారందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు.    అనంతరం ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మాట్లా డుతూ కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలకు స్వగ్రామంలో దహన సంస్కారాలు చేయడాన్ని అడ్డుకుం టున్నారని, ఇది పొరపాటన్నారు. ఇందుకు భిన్నంగా మామిడాడ ప్రజలు అభ్యంతరం చెప్పకుండా సహకరిం చడాన్ని అభినందించారు. మృతి చెందిన వ్యక్తితో సన్నిహి తంగా మెలిగిన వ్యక్తులకు పరీక్షలు చేయగా ఆరు పాజి టివ్‌ కేసులు వెలుగు చూశాయి. వీరిని వైద్యుల పర్యవేక్ష ణలో క్వారరటైన్‌కు తరలించామని ఆర్డీవో తెలిపారు. స్థానిక పరిస్థితులను మండల తహశీల్దార్‌ రాజ్యలక్ష్మి, ఎంపీడీవో విజయభాస్కర్‌, ఎస్‌ఐ లక్ష్మి పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2020-05-23T11:13:01+05:30 IST