చైనా..సిచువాన్ ప్రావిన్స్‌లో రెడ్ అలర్ట్

ABN , First Publish Date - 2020-08-14T16:18:52+05:30 IST

చైనాలో అసాధారణంగా వర్షాలు కురవడంతో వరద నీరు ఊళ్లకు ఊళ్లను ముంచెత్తి..

చైనా..సిచువాన్ ప్రావిన్స్‌లో రెడ్ అలర్ట్

చైనాలో అసాధారణంగా వర్షాలు కురవడంతో వరద నీరు ఊళ్లకు ఊళ్లను ముంచెత్తి అల్లకల్లోలం చేస్తోంది. వాగులు, వంకలు మొదలు.. నదుల వరకు అన్నీ ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రిజర్వాయర్లలో నీరు ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో అధికారులు సిచువాన్ ప్రావిన్స్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏడేళ్లలో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించడం ఇదే తొలిసారి. వరదల కారణంగా అక్కడ ఆరుగురు చనిపోయారు. ఐదుగురు గల్లంతయ్యారు.


చైనాలో జులై నెలలో కురిసిన భారీ వర్షాలు దాదాపు 2.4 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపాయి. జియాంగ్‌సూయ్, అన్హుయ్, హుబే తదితర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 20 లక్షల మందిని వేరే ప్రాంతాలకు తరలించారు. చైనాలో వరదల కారణంగా ఇప్పటివరకు లక్షా 51వేలకుపైగా ఇళ్లు కూలిపోయాయి. రూ. 68,857 కోట్ల మేర నష్టం వాటిల్లింది. చైనాలోని చాలా రిజర్వాయర్లలో వరద నీరు డేంజర్ మార్క్‌ను దాటేసింది.

Updated Date - 2020-08-14T16:18:52+05:30 IST