పండుమిర్చి ఫ్రైడ్‌ రైస్‌

ABN , First Publish Date - 2021-01-30T19:39:30+05:30 IST

పండుమిరపకాయలు - ఎనిమిది, బియ్యం - ఒకకప్పు, తరిగిన వెల్లుల్లి ఒక టీస్పూన్‌, తరిగిన అల్లం - ఒక టీస్పూన్‌, ఉల్లికాడలు - రెండు, ఉప్పు - తగినంత, సోయాసాస్‌ -

పండుమిర్చి ఫ్రైడ్‌ రైస్‌

కావలసినవి: పండుమిరపకాయలు - ఎనిమిది, బియ్యం -  ఒకకప్పు, తరిగిన వెల్లుల్లి ఒక టీస్పూన్‌, తరిగిన అల్లం - ఒక టీస్పూన్‌, ఉల్లికాడలు - రెండు, ఉప్పు - తగినంత, సోయాసాస్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, టొమాటో సాస్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, మిరియాలపొడి - ఒక టీస్పూన్‌, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: ముందుగా అన్నం వండి రెడీగా పెట్టుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. పండు మిరపకాయలు తీసుకుని, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి, కాస్త వేడి అయ్యాక తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు వేసి వేగించాలి. తరువాత పండుమిర్చి పేస్టు వేసి రెండు, మూడు నిమిషాల పాటు వేగించాలి. ఇప్పుడు సోయాసాస్‌, టొమాటో సాస్‌, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకోవాలి. తరువాత అన్నం వేసి కలియబెట్టుకోవాలి. కాసేపు వేగించి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.




Read more