Abn logo
Sep 24 2021 @ 23:48PM

రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయం : కలెక్టర్‌

అధునిక అంబులెన్సను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

రూ.52 లక్షల వైద్య పరికరాల ప్రారంభం



నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 24 : జిల్లా ప్రజలకు పలు రకాల సేవలు అందిం చడానికి ఇండియన రెడ్‌క్రాస్‌ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్‌ కేవీఎస్‌ చక్రధర్‌బాబు అన్నారు. నెల్లూరు రెడ్‌క్రాస్‌లో శుక్రవారం రూ.52 లక్షల విలువైన అత్యాఽధునిక కార్డియాక్‌ సపోర్టు, బైపాస్‌ వెంటిలేటర్‌ కలిగి ఉన్న అంబులెన్సను, 20 వెంటిలేటర్లు, ఆక్సిజన కాన్సనట్రేటర్లను ఆయన ప్రారంభించారు.  కరోనా విపత్కర సమయంలో రెడ్‌క్రాస్‌ చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 లక్షల మందకి కరోనా వ్యాక్సిన వేశామని, మరో వారంలో 5 లక్షల డోసులు వేస్తామని కలెక్టర్‌ చెప్పారు. రెడ్‌క్రాస్‌ చైర్మన చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో  వలస కార్మికులకు పునరావాస కేంద్రాలు, ఉచిత భోజన వసతి కల్పించాలమన్నారు. ఇప్పటి వరకు 395 మందికి ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించామని చెప్పారు. రూ.2.15 కోట్ల విలువైన 20 అడ్విన్డ వెంటిలే టర్లు సింగపూరు రెడ్‌క్రాస్‌ సంస్థ అందించిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం రెడ్‌క్రాస్‌ చైర్మనకు కలెక్టర్‌ ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కమిటీ వైస్‌ చైర్మన సుధీర్‌నాయుడు, సభ్యులు రవిప్రకాష్‌, సురేష్‌కుమార్‌ జైన, బయ్యా ప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌, రంగయ్య నాయుడు, గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.