‘రెడ్‌క్రాస్‌’ సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-06-12T04:43:59+05:30 IST

‘రెడ్‌క్రాస్‌’ సేవలు అభినందనీయం

‘రెడ్‌క్రాస్‌’ సేవలు అభినందనీయం
సరుకులు పంపిణీ చేస్తున్న చైర్‌పర్సన్‌ లావణ్య

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్యదేవేందర్‌యాదవ్‌


కొత్తూర్‌: కరోనా ఆపత్కాలంలో సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నిత్యావసర సరుకులు, మెడికల్‌ కిట్లు అందజేస్తున్న రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్య అన్నారు. రెడ్‌క్రాస్‌ డిస్ట్రిక్ట్‌ ఛైర్మన్‌ మామిడి భీంరెడ్డి, సొసైటీ ఫర్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ పావర్టీ అలెవియేషన్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఎండీ రొయ్యూరు సురేష్‌ సంయుక్షాధ్వర్యంలో శుక్రవా రం పారిశుధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసరాలతో పాటు మెడికల్‌ కిట్లను అందజేశారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో రెడ్‌క్రాస్‌ సొసైటీ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మామిడి భీంరెడ్డి, సురే్‌షను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వీరేందర్‌, మేనేజర్‌ మంజులత, వైస్‌చైర్మన్‌ డోలి రవీందర్‌, కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్‌, సోమ్లనాయక్‌, జయమ్మ జనార్ధన్‌చారి, ప్రసన్నలతయాదయ్య, రెడ్‌క్రాస్‌ సభ్యులు శ్రీనివాస్‌, రవి, అభిషేక్‌, వినిల్‌కుమార్‌,  తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-12T04:43:59+05:30 IST