Abn logo
Aug 14 2020 @ 11:42AM

స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ పోలీస్ వలయంలో ఉన్నాయి. ఇప్పటికే రిహార్సల్ చేశారు. అందరినీ కలుపుకుని 5వేల మందికి ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. 


ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్రపారామిలటరీ బలగాలతో ఎర్రకోట ప్రాంతమంతా జల్లెడపడుతున్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపైనుంచి జాతీయ జెండా ఎగురవేస్తారు. ప్రధాని ప్రసంగించే వేదిక చుట్టూ బుల్లెట్ ఫ్రూప్ ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
Advertisement