Advertisement
Advertisement
Abn logo
Advertisement

అవాంఛిత రోమాలు మటుమాయం!

మాంసకృత్తులు కలిగి ఉండే ఎర్ర కందిపప్పు సౌందర్య చిట్కాగా కూడా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా ముఖం మీద ఉండే అవాంఛిత రోమాలు తొలగించడం కోసం ఎర్ర కందిపప్పును వాడుకోవచ్చు. 


ఎర్ర కందిపప్పు చర్మం మీద ఉండే అవాంఛిత రోమాలతో పాటు మచ్చలను కూడా తొలగిస్తుంది. ఇందుకోసం ఎర్ర కందిపప్పుతో తయారుచేసిన ప్యాక్‌ వాడుకోవాలి. ఆ ప్యాక్‌ ఎలా తయారుచేయాలంటే....


కావలసిన పదార్థాలు: 

100 గ్రాముల ఎర్ర కందిపప్పు

గంధం పొడి: 20 గ్రాములు

బత్తాయి తొక్కు 

పాలు: ఒక కప్పు


తయారీ విధానం:

  • ఎర్ర కందిపప్పు, గంధం పొడి, బత్తాయి తొక్కలను పాలలో నానబెట్టుకోవాలి.
  • వీటన్నిటినీ కలిపి మిక్సీలో వేసి, మెత్తని ముద్దగా చేసుకోవాలి.
  • ఈ పేస్ట్‌ను క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటూ, ఆరిన తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి.
  • ఇలా రెండు వారాల పాటు చేస్తే, ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాలు నెమ్మదిగా తొలగిపోతాయి.
Advertisement
Advertisement