రాజీనామా చేస్తున్నా.. నా ఉద్యోగం నల్లజాతీయుడికి ఇవ్వండి: సెరేనా విలియమ్స్ భర్త

ABN , First Publish Date - 2020-06-06T23:30:20+05:30 IST

‘నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా.. నా ఉద్యోగం ఎవరైనా నల్లజాతీయుడికి ఇవ్వండి’ అంటూ ఆన్‌లైన్ సంస్థ రెడిట్...

రాజీనామా చేస్తున్నా.. నా ఉద్యోగం నల్లజాతీయుడికి ఇవ్వండి: సెరేనా విలియమ్స్ భర్త

వాషింగ్టన్: ‘నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా.. నా ఉద్యోగం ఎవరైనా నల్లజాతీయుడికి ఇవ్వండి’ అంటూ ఆన్‌లైన్ మీడియా సంస్థ రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ సంస్థ బోర్డును కోరారు. నల్లజాతీయులపై సాగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తాను మద్దతు తెలుపుతున్నానని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు. రెడిట్ బోర్డులో ఒకరైనా ఒహానియన్, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య, కూతురుకు సమాధానం చెప్పేందుకే రాజీనామా చేస్తున్నానని అలెక్సిస్ చెప్పారు.‘జాతివివక్షపై జరిగిన పోరాటానికి నువ్వెలా మద్దతు పలికావు నాన్నా.. అని నా కూతురు ఎప్పుడైనా అడిగితే ఆమెకు గర్వంగా సమాధానం చెప్పగలగాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ఒహానియన్ ఓ వీడియో సందేశంలో వివరించారు.

Updated Date - 2020-06-06T23:30:20+05:30 IST