Abn logo
Sep 16 2021 @ 23:57PM

విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించాలి

మనోహరాబాద్‌లో మాట్లాడుతున్న కొలారు ఎంపీ మునుస్వామి

 కోలారు (కర్ణాటక) ఎంపీ మునుస్వామి

తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/కల్హేర్‌/చిన్నశంకరంపేట, సెప్టెంబరు 16: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోలారు (కర్ణాటక) ఎంపీ మునుస్వామి పేర్కొన్నారు. నిర్మల్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవసభకు కేంద్ర హోంమంత్రి హాజరవుతున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు వెళ్తూ గురువారం మనోహరాబాద్‌ వద్ద ఆయన ఆగి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ కిసాన్‌ మోర్చా మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి,  రాష్ట్ర బీజేపీ కౌన్సిల్‌ సభ్యుడు కరణం సంగమేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం కల్హేర్‌, చిన్నశంకరంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.