1801 మంది బాలకార్మికులకు విముక్తి

ABN , First Publish Date - 2022-01-24T08:59:00+05:30 IST

ఆపరేషన్‌ స్మైల్‌-8లో భాగంగా రాష్ట్రంలో 1801 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించామని తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది.

1801 మంది బాలకార్మికులకు విముక్తి

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ స్మైల్‌-8లో భాగంగా రాష్ట్రంలో 1801 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించామని తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది. బాలలతో చట్ట విరుద్ధంగా పనులు చేయిస్తున్న వారిపై 213 కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. 20 రోజుల్లో 1801 మందిని రెస్క్యూ చేయగా.. అందులో 1472 మంది బాలలు, 329 మంది బాలికలున్నారని తెలిపింది. వారిలో 1546 మందిని తల్లిదండ్రులకు అప్పగించామని, 255 మందికి బాలల సంరక్షణ కేంద్రాల్లో పునరావాసం కల్పించామని వివరించింది. ఇళ్లలో పనిచేస్తున్న 893 మంది, ఇటుక బట్టీల్లో 155 మంది, యాచక వృత్తి చేస్తున్న 81 మంది, వీఽధి బాలలు 121 మందిని రెస్క్యూ చేశామని పేర్కొంది. 

Updated Date - 2022-01-24T08:59:00+05:30 IST