పునర్విభజనకు కసరత్తు

ABN , First Publish Date - 2020-11-14T06:12:20+05:30 IST

లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ లెక్కన ప్రస్తుతం వున్న విశాఖ జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లితోపాటు అరకులోయ లేదా పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు.

పునర్విభజనకు కసరత్తు

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలు

మూడు ఖాయం?

విశాఖ, అనకాపల్లితో పాటు అరకులోయ లేదా పాడేరు కేంద్రంగా మరో జిల్లా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ లెక్కన ప్రస్తుతం వున్న విశాఖ జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లితోపాటు అరకులోయ లేదా పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. నియోజకవర్గాల వారీ (కొత్త జిల్లాల)గా విస్తీర్ణం, జనాభా వివరాలు సిద్ధం చేశారు. ప్రస్తుత విశాఖ జిల్లా మొత్తం విస్తీర్ణం 11,161 చదరపు కిలోమీటర్లు కాగా 2011 లెక్కల ప్రకారం 42,90,589 మంది జనాభా ఉన్నారు. విశాఖ నగరంలోని విశాఖ తూర్పు, దక్షిణం, ఉత్తరం, పశ్చిమ, గాజువాక, భీమిలి నియోజకవర్గాలతోపాటు విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోటతో కలిపి విశాఖ జిల్లా ఏర్పాటుకానున్నది. ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల విలీనంపై అభ్యంతరాలు వున్నప్పటికీ ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్‌తో కలిసి ప్రతిపాదనలు రూపొందించారు. కొత్తగా ఏర్పాటుకానున్న విశాఖ జిల్లాలో ఏడు సెగ్మెంట్‌ల విస్తీర్ణం 1548 చ.కి.మీ, జనాభా 20,64,488. విశాఖ జిల్లా విస్తీర్ణపరంగా చిన్నదే అయినా జనాభాపరంగా పెద్దదిగా ఉంటుంది.


అనకాపల్లి జిల్లాలో పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటాయి. కొత్త జిల్లా విస్తీర్ణం 4,510 చదరపు కిలోమీటర్లు కాగా జనాభా 19,02,691 మంది. అనకాపల్లి జిల్లాలో గ్రామీణ, నగర, పట్టణ ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంత గిరిజన గ్రామాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా అనకాపల్లి దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలోని ప్రజలకు చేరువలో ఉంటుంది.  ఇక అరకులోయ లోక్‌సభ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి శ్రీకాకుళం జిల్లా పాలకొండ (ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు) వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో అరకు కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. రెండు జిల్లాలు చేయదలిస్తే అరకులోయ లేదా పాడేరు కేంద్రంగా ఒకటి, పార్వతీపురం కేంద్రంగా మరో జిల్లా ఏర్పడతాయి. అయితే ఒక్క జిల్లా చేయదలిస్తే పార్వతీపురాన్ని కేంద్రంగా చేసి...అరకులోయను అందులో విలీనం చేస్తారని, పాడేరును అనకాపల్లి జిల్లాలో, రంపచోడవరాన్ని రాజమండ్రి జిల్లాలో కలుపుతారని అంటున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో గల పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. ఈ రెండు సెగ్మెంట్‌ల విస్తీర్ణం 5,822 చదరపు కిలోమీటర్లు కాగా...జనాభా 6,04,047.

ఇబ్బంది వుండబోదని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.


                                       విస్తీర్ణం                     జనాభా

ప్రస్తుతం విశాఖ జిల్లా                         11,161 చ.కి.మీ.     42,90,589

కొత్తగా ఏర్పాటుకానున్న విశాఖ జిల్లా       1,548 చ.కి.మీ.     20,64,488

అనకాపల్లి జిల్లా విస్తీర్ణం                        4,510 చ.కి.మీ.     19,02,691 

అరకు, పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ల విస్తీర్ణం 5,822 చ.కి.మీ.      6,04,047

Updated Date - 2020-11-14T06:12:20+05:30 IST