రెడ్‌మి వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

సంగీత ప్రియుల కోసం రెడ్‌మి మొదటిసారి వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ‘రెడ్‌మి ఇయర్‌బడ్స్‌ ఎస్‌’

రెడ్‌మి వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌

సంగీత ప్రియుల కోసం రెడ్‌మి మొదటిసారి వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ‘రెడ్‌మి ఇయర్‌బడ్స్‌ ఎస్‌’ పేరుతో విడుదల చేసిన ఇయర్‌బడ్స్‌ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వీటిని ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవడం కూడా చాలా తేలిక. ఎలాంటి యాప్స్‌ అవసరం లేదు. అంతేకాకుండా మల్టిఫంక్షన్‌ బటన్‌ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌ టచ్‌ చేసే అవసరం లేకుండా ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇవ్వొచ్చు. గేమ్స్‌ ఆడే సమయంలో ఆడియో ల్యాగ్‌ లేకుండా గేమింగ్‌ మోడ్‌ను పొందుపరిచారు. వర్షంలోనూ, వర్కవుట్లు చేసే సమయంలో వచ్చే చెమటతోనూ దెబ్బతినకుండా ఉండేందుకు వాటర్‌ రెసిస్టెన్స్‌ సపోర్టు ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 గంటలపాటు ఏకధాటిగా ఉపయోగించవచ్చు. ఇయర్‌బడ్స్‌ టిప్‌పై డబల్‌క్లిక్‌ చేయడం ద్వారా వాయిస్‌ అసిస్టెంట్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. వీటి ధర రూ. 1799. 

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST