Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెంచిన ఫీజులను తగ్గించండి

కేయూలో ఇంజనీరింగ్‌ విద్యార్థుల ఆందోళన 

కేయూ క్యాంపస్‌, నవంబరు 3: కాకతీయ యూనివర్సిటీలో పెంచిన ఇంజనీరింగ్‌ ఫీజులను తగ్గించాలని విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఫీజుల పెంపుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతోందని పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. వర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం.. ఫీజులు మాత్రం పెంచుతోందని మండిపడ్డారు. వర్సిటీ పరిపాలన అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసిన విద్యార్థులు.. అద్దాలను ధ్వంసం చేసి పరిపాలన భవనంలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. 

Advertisement
Advertisement