Abn logo
Sep 23 2021 @ 00:46AM

రసాయనిక ఎరువుల వాడకం తగ్గించండి: డీడీఏ

బత్తలపల్లి మండలంలో వేరుశనగ పంట పరిశీలిస్తున్న అధికారులు

బత్తలపల్లి, సెప్టెంబరు22: రైతులందరూ రసాయనిక ఎరు వులవాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని డీడీఏ త్రిలోక్‌నాథ్‌ తెలిపారు. మండలంలోని మాల్యవంతం గ్రామం లో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా డీడీఏ హాజరయ్యారు. గ్రామంలో కుళ్లాయమ్మ వేరుశ నగ పొలంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేరుశనగ పంటలను పరిశీలించి పలుసలహాలు, సూచనలు ఇచ్చారు. రైతులు క్రిమిసంహారకమందులు, రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. ప్రకృతివ్యవసాయం పద్ధతులు పాటించి పంటలను సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. అలాగే ముష్టూరు గ్రామంలో శాస్త్రవేత్త సహదేవరెడ్డి పొలాలను పరిశీలించారు. వేరుశనగ సాగుచేయని రైతులు ఉలవ, పెసర, వంటి పంటలు సాగుచేయాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ఏఓ పెన్నయ్య, వీహెచఏ లావణ్య, ఏఈఓ వీరాంజినేయులు, వీఏఏలు పాల్గొన్నారు.