తగ్గిన టాటా మోటార్స్‌ నష్టం

ABN , First Publish Date - 2021-05-19T05:43:36+05:30 IST

టాటా మోటార్స్‌ కన్సాలిడేటెడ్‌ నష్టాలు మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అంతకు ముందు ఏడాది అదే త్రైమాసికంతో పోల్చితే రూ.9,864 కోట్ల నుంచి రూ.7,585 కోట్లకు తగ్గాయి

తగ్గిన టాటా మోటార్స్‌ నష్టం

ముంబై: టాటా మోటార్స్‌ కన్సాలిడేటెడ్‌ నష్టాలు మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అంతకు ముందు ఏడాది అదే త్రైమాసికంతో పోల్చితే రూ.9,864 కోట్ల నుంచి రూ.7,585 కోట్లకు తగ్గాయి. మొత్తం ఆదాయం మాత్రం రూ.63,057 కోట్ల నుంచి రూ.89,319 కోట్లకు పెరిగింది. అదే తేదీతో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కంపెనీ రూ.2,52,438 కోట్ల ఆదాయం ఆర్జించింది. అయితే స్టాండ్‌ ఎలోన్‌ ప్రాతిపదికన మాత్రం కంపెనీ ఆదాయం రూ.10,001.79 కోట్ల నుంచి రూ.20.306 కోట్లకు చేరింది. అలాగే 2019-20లో సాధించిన రూ.4871.05 కోట్ల నష్టం నుంచి కంపెనీ రూ.1645.69 కోట్ల లాభం ఆర్జించగలిగింది. 

Updated Date - 2021-05-19T05:43:36+05:30 IST