సాగర్‌ జలాశయానికి తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-10-14T00:54:44+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక స్వల్పంగా తగ్గడంతో నాలుగు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌ జలాశయానికి తగ్గిన వరద

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక స్వల్పంగా తగ్గడంతో నాలుగు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.60 అడుగులు(310.8498 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 9,245 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,541 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 29,516 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, నాలుగు క్రస్ట్‌గేట్ల నుంచి 32,232 క్యూసెక్కులు సాగర్‌ నుంచి మొత్తం  81,934 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2021-10-14T00:54:44+05:30 IST