తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2021-05-17T05:30:00+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో జిల్లాలో చాలావరకు భూముల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.

తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు
విధుల్లో సబ్‌ రిజిస్ట్రార్‌, ఉద్యోగులు


రైటర్ల పెన్‌డౌన్‌తో మరింత దిగజారిన వైనం

ప్రభుత్వ ఆదాయానికి గండి

మొదటి రోజు పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఖాళీ


అనంతపురం క్రైం, మే 17:  కొవిడ్‌ నేపథ్యంలో జిల్లాలో చాలావరకు భూముల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సేవంలందించాలని షరతు విధించింది. దీంతో జిల్లావ్యాప్తంగా క్రయ విక్రయాలు తగ్గాయి. క్రయవిక్రయదారులు కూడా కొవిడ్‌ భయంతో ముందుకు రావడం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా 60 శాతం వరకు భూముల రిజిస్ట్రేషన్లు తగ్గడంతో రూ.కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని ఆ శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. తాజాగా జిల్లావ్యాప్తంగా డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం సోమవారం నుంచి 22వ తేదీ వరకు పెన్‌డౌన్‌ చేయడంతో సోమవారం రోజున జిల్లావ్యాప్తంగా ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు సాగలేదు. దీంతో జిల్లాలో చాలా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు క్రయవిక్రయదారులు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. అక్కడక్కడ క్రయవిక్రయదారులు స్వచ్ఛందంగా డాక్యుమెంట్లు తయారు చేసుకోవడంతో 20 శాతం మేర రిజిస్ట్రేషన్లు సాగినట్లు ఆ శాఖాధికారుల ద్వారా తెలిసింది.


డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌

కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంట్‌ రైటర్లు ఈనెల 22వ తేదీ వరకు పెన్‌డౌన్‌ చేశారు. దీంతో జిల్లాలోని అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ల పరిధిలోని 21 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్ల దుకాణాలు మూతపడ్డాయి. ఆయా దుకాణాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద క్రయవిక్రయదారులు లేక బోసిపోయాయి. జిల్లాకేంద్రంలోని రాంనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం కేవలం 20 రిజిస్ట్రేషన్లు మాత్రమే సాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 80 నుంచి 100 అయ్యేవి.


60 శాతం వరకు తగ్గిన క్రయవిక్రయాలు

జిల్లావ్యాప్తంగా సాధారణ రోజుల్లో సుమారు 1200 రిజిస్ర్టేషన్లు సాగేవి. తద్వారా ప్రభుత్వానికి రోజూ రూ.50కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కార్యాలయాల పనివేళల కుదింపు, డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌తో సోమవారం రిజిస్ర్టేషన్లు పడిపోయినట్లు సమాచారం. దీంతో రూ.10కోట్లు కూడా ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. కొన్ని రోజులుగా 60 శాతం వరకు క్రయవిక్రయాలు తగ్గిపోవడంతో రోజూ రూ.20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు అది మరింత పడిపోయింది.


పెన్‌డౌన్‌తో సంబంధం లేదు.. : హరివర్మ, జిల్లా రిజిస్ట్రార్‌

డాక్యుమెంట్‌ రైటర్లు పెన్‌డౌన్‌ చేయడంతో మాకు సంబంధం లేదు. రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొ నసాగుతాయి. ఇం దు లో అనుమానాలకు తా వులేదు. క్రయవిక్రయదారు లు సొంతంగా డాక్యుమెంట్లు తయారు చేసు కునేందుకు వీలుగా ప్రత్యేక ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చే స్తున్నాం. కావున క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. కొవిడ్‌ నేపథ్యంలో కొంత వరకు రిజిస్ట్రేషన్లు తగ్గా యి. డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌తో సోమవారం క్రయవిక్రయదారులు సొంతంగా తయారు చేసుకుని, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. సమస్యలుంటే సం బంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిసి, పరిష్కరించుకోవచ్చు.


Updated Date - 2021-05-17T05:30:00+05:30 IST