వైద్యంపై జీఎస్టీ తగ్గించడం హర్షణీయం: సంజయ్‌

ABN , First Publish Date - 2021-06-13T08:48:54+05:30 IST

జీఎస్టీ కౌన్సిల్‌లో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

వైద్యంపై జీఎస్టీ తగ్గించడం హర్షణీయం: సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ కౌన్సిల్‌లో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ‘మొదటిసారి గెలిచినప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన మీరు, ఇప్పుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా..?’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌విఎ్‌సఎ్‌స ప్రభాకర్‌.. టీఆర్‌ఎ్‌సకు సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసం కోల్పోయిందని, అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో 13 సర్వీస్‌ రోడ్ల నిర్మాణం పెద్ద కుంభకోణంగా మారిందని విమర్శించారు. 

Updated Date - 2021-06-13T08:48:54+05:30 IST