సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.45కు తగ్గింపు

ABN , First Publish Date - 2021-05-11T09:46:09+05:30 IST

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఫేజ్‌-2లో 12వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి సోలార్‌ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.

సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.45కు తగ్గింపు

హైదరాబాద్‌, మే 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఫేజ్‌-2లో 12వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి సోలార్‌ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ స్కీమ్‌లో మార్పులు చేసింది. రూ.2.80 ఉన్న యూనిట్‌ ధరను రూ.2.45లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీపీసీ, సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థలు ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాయి. సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే వాళ్లకు ఒక్కో మెగావాట్‌కు రూ.70లక్షల రాయితీ ఉండగా దాన్ని రూ.55లక్షలకు తగ్గించారు.  

Updated Date - 2021-05-11T09:46:09+05:30 IST