ఇన్‌స్టాలో ‘రీల్స్‌’

ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST

వీడియోలు క్రియేట్‌ చేసే నెటిజన్లను ఆకట్టుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ ‘రీల్స్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. టిక్‌టాక్‌పై నిషేధం పడటంతో ఎక్కువ మంది వీడియో కంటెంట్‌ క్రియేటర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు...

ఇన్‌స్టాలో ‘రీల్స్‌’

వీడియోలు క్రియేట్‌ చేసే నెటిజన్లను ఆకట్టుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ ‘రీల్స్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.  టిక్‌టాక్‌పై నిషేధం పడటంతో ఎక్కువ మంది వీడియో కంటెంట్‌ క్రియేటర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. అలాంటి వారికి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ఆప్షన్‌ చక్కగా ఉపయోగపడనుంది. ఇందులో 15 సెకన్ల వీడియో క్లిప్స్‌ను రికార్డు చేసి పోస్టు చేసే వీలుంది. అంతేకాకుండా ఆ వీడియోలకు ఆడియో, ఎఫెక్టులు జోడించవచ్చు. సంక్షిప్త రూపంలో కంటెంట్‌ను సృష్టించి, క్రియేటర్లుగా నిలవాలనుకునే వారికి రీల్స్‌ చక్కటి అవకాశంగా నిలుస్తుంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న సభ్యులందరూ మీరు పోస్ట్‌ చేసిన వీడియోలు చూసే వీలుంది. టిక్‌టాక్‌లో చేసిన విధంగానే ఇక్కడా వీడియోలకు స్పెషల్‌ ఎఫెక్టులు జోడించి షేర్‌ చేయవచ్చు. రీల్స్‌ను ఉపయోగించుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్‌ కెమెరా బాటమ్‌లో ఉండే రీల్స్‌ను ఎంచుకోవాలి. ఆడియో, ఏఆర్‌ ఎఫెక్ట్స్‌, టైమర్‌, కౌంట్‌డౌన్‌, ఎలైన్‌, స్పీడ్‌ వంటి ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు. మీది ప్రైవేట్‌ అకౌంట్‌ అయితే ఫాలోవర్స్‌ మాత్రమే చూసే వీలుంది. పబ్లిక్‌ అకౌంట్‌ అయితే అందరూ చూసేలా షేర్‌ చేయవచ్చు. 

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST