Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 10 2021 @ 17:28PM

గిరిజనులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు: రేగా కాంతారావు

హైదరాబాద్: కాంగ్రెస్ గిరిజనులపై మొసలి కన్నీరు కారుస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ని విమర్శిస్తే కాంగ్రెస్‌కు మైలేజ్ రాదన్నారు. కాంగ్రెస్ సంగతి చూడ్డానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు కాంగ్రెస్‌పై తాము కూడా దండోరా మోగిస్తామని రేగా కాంతారావు అన్నారు. రేవంత్ డ్రామాలను ప్రజలు నమ్మడం లేదని రేగా కాంతారావు తెలిపారు. 

Advertisement
Advertisement