కరోనాతో రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2021-05-08T04:50:35+05:30 IST

జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని ఓ మహిళా ఉద్యోగి కరోనాతో బాధపడుతూ శుక్రవారం చైన్నైలో మృతిచెందారు.

కరోనాతో రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగి మృతి

బెంబేలెత్తుతున్న ఉద్యోగులు

నెల్లూరు(హరనాథపురం), మే 7 : జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని ఓ మహిళా ఉద్యోగి కరోనాతో బాధపడుతూ శుక్రవారం చైన్నైలో మృతిచెందారు. రిజిస్ట్రార్‌ కార్యాలయం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పలువురు కరోనా బారిన పడినా ఇప్పటి వరకు మరణాలు సంభవించలేదు. ఇదే తొలి మరణం. అధికారుల వివరాల ప్రకారం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం. కామాక్షి 15 రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. చైన్నైలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు.  ఆమె మృతితో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమయం కుదించినా జనతాకిడి వల్ల కరోనా బారిన పడతామేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామాక్షి మృతి తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి కలగాని స్టాంపులు-రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ అబ్రహం, రిజిస్ట్రార్‌ మునిశంకరయ్య ప్రార్థించారు. 

Updated Date - 2021-05-08T04:50:35+05:30 IST