Abn logo
Jan 15 2021 @ 23:59PM

బైండోవర్‌ కేసుల నమోదు

కొత్తవలస, జనవరి 15: తుమ్మికాపల్లి గ్రామంలో భూమి విషయమై గొడవ లు పడుతున్న రెండు వర్గాలపై సెక్షన్‌ 107 కింద బైండోవర్‌ కేసులు నమోదు చేశామని ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. తుమ్మికాపల్లి గ్రామంలో ఒకే భూమి విషయమై గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రెండు వర్గాలు గొడవలు పడుతున్నాయి. దీంతో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ఉండేందుకుగాను రెండు వర్గాలకు చెందిన ఎనిమిదిమందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 

 


Advertisement
Advertisement
Advertisement