ఆన్‌లైన్‌లో సహకార సంఘాల రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2021-08-01T09:25:49+05:30 IST

రాష్ట్రంలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్‌ ఇక ఆన్‌లైన్‌లో జరగనుంది. జిల్లా సహకార కార్యాలయాలకు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, బైలా్‌సను

ఆన్‌లైన్‌లో సహకార సంఘాల రిజిస్ట్రేషన్‌


హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్‌ ఇక ఆన్‌లైన్‌లో జరగనుంది. జిల్లా సహకార కార్యాలయాలకు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, బైలా్‌సను దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌ ద్వారా పొందొచ్చు. ఈ-సహకార సేవ పేరుతో రూపొందించిన వెబ్‌సైట్‌ను సహకార సంఘాల రిజిస్ట్రార్‌ వీరబ్రహ్మయ్య శనివారం ప్రారంభించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా https://esahakaraseva.telangana  వెబ్‌సైట్‌ను రూపొందించామని తెలిపారు. 


Updated Date - 2021-08-01T09:25:49+05:30 IST