రెజ్లింగ్‌లో జిల్లాకు పతకాలు

ABN , First Publish Date - 2021-03-06T06:00:30+05:30 IST

కాకినాడస్పోర్ట్స్‌, మార్చి 5: కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో పతకాలు సాధించారు. అండర్‌-15, అండర్‌-23 విభాగాల్లో జిల్లా నుంచి హాజరై పతకాలు సాధించిన క్రీడాకారులు, డీఎ్‌సఏ రెజ్లింగ్‌ కోచ్‌ దుర్గను డీ

రెజ్లింగ్‌లో జిల్లాకు పతకాలు

కాకినాడస్పోర్ట్స్‌, మార్చి 5: కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో పతకాలు సాధించారు. అండర్‌-15, అండర్‌-23 విభాగాల్లో జిల్లా నుంచి హాజరై పతకాలు సాధించిన క్రీడాకారులు, డీఎ్‌సఏ రెజ్లింగ్‌ కోచ్‌ దుర్గను డీఎ్‌సఏలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఈవో భానుప్రకాష్‌, చీఫ్‌ కోచ్‌ సురే్‌షకుమార్‌, రెజ్లింగ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ జి.ఎలీషాబాబు, కార్యదర్శి రామచంద్రమూర్తి అభినందించారు. అండర్‌-15 విభాగంలో కె.మనోజ్‌ బంగారు, పి.అజయ్‌ రజత పతకాలు సాధించగా.. కె.దీన, కె.రాజేష్‌, పి.జాషువ, బి.దుర్గాప్రసాద్‌, వై.ప్రసాద్‌ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. అండర్‌-23 విభాగంలో ఏవీ ప్రణీత, వై.వినయ్‌కుమార్‌, పి.దుర్గామహేష్‌, టి.సాయిమణికంఠ బంగారు పతకాలు, జి.ఝాన్సీ, పి.కాంతిరేఖ, కె.అనుషా రజత, వి.విజయదుర్గ, కె.నాగసురేంద్ర కాంస్య పతకాలు  సాధించారు. 

Updated Date - 2021-03-06T06:00:30+05:30 IST