కొందరు రెగ్యులర్‌ ఉపాధ్యాయులు వేధిస్తున్నారు

ABN , First Publish Date - 2022-01-21T05:04:22+05:30 IST

కొందరు రెగ్యులర్‌ ఉపాధ్యాయుల వేధింపులు భరించలేకున్నానని రక్షణ కల్పించకుంటే ఆత్మహత్యే శరణ్యమని ములకలచెరువు మోడల్‌ స్కూల్లో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ హాజీరున్నీసా వాపోయారు. గురువారం ఆమె మీడియా ఎదుట తన ఆవేదన వెలిబుచ్చారు.

కొందరు రెగ్యులర్‌ ఉపాధ్యాయులు వేధిస్తున్నారు
విలేకరుల ముందు రోధిస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ హాజీరున్నిస్సా

మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ ఆవేదన

ములకలచెరువు, జనవరి 20: కొందరు రెగ్యులర్‌ ఉపాధ్యాయుల వేధింపులు భరించలేకున్నానని రక్షణ కల్పించకుంటే ఆత్మహత్యే శరణ్యమని ములకలచెరువు మోడల్‌ స్కూల్లో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ హాజీరున్నీసా వాపోయారు. గురువారం ఆమె మీడియా ఎదుట తన ఆవేదన వెలిబుచ్చారు. బి.కొత్తకోటకు చెందిన తాను 2015 నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని తెలియజేశారు. తనకు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాని  మెడికల్‌ లీవు ఇవ్వడం లేదని వాపో యింది. తన ఇద్దరు బిడ్డలు చనిపోయిన ఆవేదనలో ఉన్నానని ఆ పరిస్థితిలో నమస్కారం పెట్టడం లేదని అవమానిస్తున్నారని కన్నీటిపర్యంతమైంది. ఆరోగ్యం బాగోలేదని స్టాఫ్‌ వాష్‌రూమ్‌కు వెళ్లనీయకుండా వివక్ష చూపుతున్నారని వాపోయింది. స్కూల్‌ సమయం ముగిసినా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విలపించింది. ఉన్నతాధికారులకు చెబితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకుంది.  


Updated Date - 2022-01-21T05:04:22+05:30 IST