ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

ABN , First Publish Date - 2021-01-17T05:28:40+05:30 IST

వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఆ సంఘ నాయకులు జేవీ ప్రసాదరావు, ఎల్‌.సత్యారావు డిమాండ్‌ చేశా రు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయండి

కొత్తవలస: వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఆ సంఘ నాయకులు జేవీ ప్రసాదరావు, ఎల్‌.సత్యారావు డిమాండ్‌ చేశా రు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును కలిసి వినతి ప్రతాన్ని అం దించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2003 నుంచి వైద్య ఆరోగ్య శాఖలో విధు లు నిర్వహిస్తున్నా... తాత్కలికంగా ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారుతున్నారే తప్ప న్యాయం జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. 

 


Updated Date - 2021-01-17T05:28:40+05:30 IST