కరోనా సోకిందని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-07T09:51:39+05:30 IST

కరోనా మహమ్మారి ఓ వైద్యుడి ప్రాణాన్ని బలిగొంది. ఫ్రెంచ్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ రీమ్స్‌ డాక్టర్‌ బెర్నార్డ్‌ గోంజలెజ్‌ (60)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ...

కరోనా సోకిందని ఆత్మహత్య

రీమ్స్‌ (ఫ్రాన్స్‌): కరోనా మహమ్మారి ఓ వైద్యుడి ప్రాణాన్ని బలిగొంది. ఫ్రెంచ్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ రీమ్స్‌ డాక్టర్‌ బెర్నార్డ్‌ గోంజలెజ్‌ (60)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు క్లబ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గోంజలెజ్‌ సూసైడ్‌ నోట్‌లో రాసినట్టు తెలిసింద’ని రీమ్స్‌ మేయర్‌ అర్నార్డ్‌ రోబినెట్‌ చెప్పారు. 

కరోనాతో బాక్సింగ్‌ దిగ్గజం సోదరుని మృతి

బ్రిటిష్‌ బాక్సింగ్‌ దిగ్గజం నిగెల్‌ బెన్‌ సోదరుడు కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందాడు. ఈ విషయాన్ని బెన్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. 

Updated Date - 2020-04-07T09:51:39+05:30 IST