బడికొస్తే వెయ్యి

ABN , First Publish Date - 2021-06-17T08:11:17+05:30 IST

సమాజంమీద ప్రేమ ఉండే మనుషులు ఊరికే లోకాన్ని, ప్రభుత్వాలను తిడుతూ కూర్చోరు. ఉత్తుత్తి మాటలతో కాలక్షేపం చేయరు. చేతిలో గడ్డిపరక ఉన్నా సరే సాయం చేయడానికి దాంతోనే ముందుకు కదులుతారు. కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే రేఖ అనే

బడికొస్తే వెయ్యి

సమాజంమీద ప్రేమ ఉండే మనుషులు ఊరికే లోకాన్ని, ప్రభుత్వాలను తిడుతూ కూర్చోరు. ఉత్తుత్తి మాటలతో కాలక్షేపం చేయరు. చేతిలో గడ్డిపరక ఉన్నా సరే సాయం చేయడానికి దాంతోనే ముందుకు కదులుతారు. కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే రేఖ అనే ఓ టీచరమ్మ పిల్లలు బడికొస్తే చాలు.. ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయలు ఇస్తోంది. తక్కువ అమౌంటే కావొచ్చు.. అయితే దానిద్వారా ఆమె కోట్లశక్తిని పుట్టించగలిగింది. 


అది 2010 సంవత్సరం..

కర్ణాటకలోనే శివమొగ్గ జిల్లాలోని నుల్లిగెరె అనే పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరింది రేఖ. చేరినప్పుడు ఆ పాఠశాలలో పదోతరగతి వరకూ ఎనభైలోపే విద్యార్థులుండేవారు. మెల్లమెల్లగా ఈ సంఖ్య తగ్గడం మొదలైంది. మధ్యాహ్న భోజన పథకం లాంటివి ఉన్నా పేదరికం వల్ల పిల్లలు పాఠశాలకు దూరం కావటంతో పాటు కొత్తగా ఒకటో తరగతిలో పిల్లలు ఎవరూ చేరకపోవటంతో ఆమె బాధపడింది.

 

ఒక్క ఆలోచనతో బడిలో సందడి

ప్రతి సంవత్సరం బడికొచ్చే చిన్నారుల సంఖ్య తగ్గిపోతుండటంతో ఉపాధ్యాయురాలు రేఖ బాధపడింది. ఏమైనా చేయలేమా? అని ఆలోచించింది. ఎవరైనా మొదటి తరగతిలో చేరితే వెయ్యి రూపాయలు వాళ్ల పేరు మీద కెనరా బ్యాంక్‌ అకౌంట్‌లో జమచేస్తానని చెప్పింది. ఆ డబ్బు తన జీతం నుంచే ఇచ్చింది రేఖ. పదో తరగతి తర్వాత వచ్చే 2400 రూపాయలు విద్యార్ధికి అందేలా ఓ బాండ్‌ ఇచ్చింది. దీంతో పేద తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పువచ్చింది. 


ఈ ఏడాది డబుల్‌ డిజిట్‌..

రేఖది కూడా పేదకుటుంబమే. పేదల కష్టాలు తనకేంటో తెలుసు. ప్రతిరోజూ తన ఊరినుంచి వందకిలోమీటర్లు ప్రయాణించి బడికొస్తుంది. 2014 సంవత్సరంలో మొదటి తరగతిలో ఒకరో ఇద్దరో కూడా అడ్మిషన్‌ తీసుకోవటం కష్టమయ్యేది. వెయ్యిరూపాయలు ఇస్తారు ఫలానా స్కూల్‌లో అనే విషయం ఆ చుట్టు పక్కన ఊళ్లకు తెలుసు కాబ్బటి ఫస్ట్‌క్లాస్‌ అడ్మిషన్లు ఫస్ట్‌క్లాస్‌గా అవుతున్నాయి. ఈ ప్యాండమిక్‌ పరిస్థితుల్లో  ఇప్పటికే 13 మంది అడ్మిషన్‌ తీసుకున్నారు. ఈ ఎనిమిదేళ్లలో 63 మంది పిల్లలకు వెయ్యి రూపాయల బాండ్‌ ఇచ్చారామె. ‘రేఖాబాండ్‌’గా ఇదిపాపులరైంది. అదో బ్రాండ్‌ ఇప్పుడు. రేఖ మంచి మనసు చూశాక.. కొన్ని ఎన్జీవోలు, కొంతమంది దాతలు ప్రతి ఏడాది నోట్‌ బుక్కులు, షూలు విద్యార్థులకు ఇవ్వడం ప్రారంభించారు. బడిలో కుర్చీలు, బల్లలతో పాటు ఇతర వసతులను కొందరు ఏర్పాటు చేశారు. ‘అందరి సహకారంతోనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. నా భర్త సపోర్ట్‌ చాలా ఉంది. ఏదైనా మన పని మనం చేసుకుంటూ పోతే మనలను గుర్తిస్తారు’ అంటుంది రేఖ ప్రభాకర్‌. అన్నట్లు రేఖ కన్నడం, ఇంగ్లీషుతో పాటు ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ బోధిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో రేఖలాంటి మంచి మనసుండే వాళ్లుంటారు. సమాజానికి స్ఫూర్తి‘రేఖ’లు ఇలా సామాన్యంగానే ఉంటారు.


ప్రతి సంవత్సరం బడికొచ్చే చిన్నారుల సంఖ్య తగ్గిపోతుండటంతో ఉపాధ్యాయురాలు రేఖ బాధపడింది. ఏమైనా చేయలేమా అని ఆలోచించింది. ఎవరైనా మొదటి తరగతిలో చేరితే వెయ్యి రూపాయలు వాళ్ల పేరు మీద కెనరా బ్యాంక్‌ అకౌంట్‌లో జమచేస్తానని చెప్పింది. ఆ డబ్బు తన జీతం నుంచే ఇచ్చింది రేఖ.

Updated Date - 2021-06-17T08:11:17+05:30 IST