Abn logo
Nov 26 2020 @ 18:32PM

నవ్వుకే నవ్వు తెప్పించే నటుడాయన..

నవ్వుకే నవ్వు తెప్పించే నటనతో అలరించారు రేలంగి వెంకట్రామయ్య. నవంబర్ 26న రేలంగి వర్ధంతి . ఈ సందర్భంగా రేలంగి పంచిన నవ్వుల పువ్వులను మననం చేసుకుందాం. తెలుగు సినిమా రంగంలో అసలు సిసలు నవ్వులు పూయడానికి ఆద్యుడు రేలంగి వెంకట్రామయ్య అంటే అతిశయోక్తి కాదు. గాయకహాస్యనటుల్లో రేలంగి స్థానం ప్రత్యేకమైనది. తెలుగు హాస్యాభినయాన్ని విభజిస్తే రేలంగికి ముందు, రేలంగి తరువాత అనే విడదీసి తీరాలి. అంతకు ముందు నాటకఫక్కీలోనే సాగిన హాస్యానికి సినిమా ఒరవడి అద్ది తెలుగుతెరపై నవ్వులతో వెలుగు తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా రేలంగిదే. తెలుగు చిత్రసీమలో 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్న తొలి హాస్యనటునిగా రేలంగి నిలచిపోయారు.


రేలంగి అనగానే నవ్వుల పువ్వులే పూస్తాయి అని అందరూ భావిస్తారు. అనేక చిత్రాల్లో ఆయన సెంటిమెంట్, విలనీ కూడా పండించి మెప్పించారు. అందుకే రేలంగిని రీప్లేస్ చేసేవారు ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో కనిపించరు. భావి హాస్యనటులకు స్ఫూర్తి ప్రదాతగా నిలచిన రేలంగి చిరస్మరణీయులు. తెలుగు సినిమా హాస్యం చర్చకు వచ్చిన ప్రతీసారి రేలంగి నవ్వులు మనకు కితకితలు పెడుతూనే ఉంటాయి.


Advertisement
Advertisement
Advertisement