అమ్మా... లేమ్మా !

ABN , First Publish Date - 2020-09-27T08:16:02+05:30 IST

అమ్మా... లేమ్మా...! మేమొచ్చాం చూడమ్మా ! అంటూ చిన్నారులు తమ తల్లి శవం వద్ద ఏడవటం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. హృదయవిదారకమైన ఈ ఘటన శనివారం...

అమ్మా... లేమ్మా !

తల్లి శవం వద్ద నలుగురు చిన్నారుల వేదన

ఆపరేషన్‌ చేయించుకున్న మహిళ మృతి

డాక్టర్లే చంపారంటూ బంధవుల ఆరోపణ


అనంతపురం వైద్యం, సెప్టెంబరు: అమ్మా... లేమ్మా...! మేమొచ్చాం చూడమ్మా ! అంటూ చిన్నారులు తమ తల్లి శవం వద్ద ఏడవటం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. హృదయవిదారకమైన ఈ ఘటన శనివారం జిల్లా కేంద్రంలోని సూర్యానగర్‌లోని శ్రీనివాస ఆసుపత్రి వద్ద జరిగింది. వివరాలిలా... శింగనమల మం డలం శివపురం గ్రామానికి చెందిన రాధ(35) గొంతు నొప్పికి చికిత్స పొందుతోంది. గొంతులో గడ్డలు ఉన్నా యని  ఆపరేషన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించా రు. దీంతో రాధ, భర్త రామాంజనేయులు శ్రీనివాస ఆసుప త్రిలో ఆపరేషన్‌కు డాక్టర్లతో మాట్లాడుకున్నారు. గత బుధవారం సాయంత్రం ఆమెకు గొంతుకు  శస్త్ర చికిత్స చేసి గడ్డలు తొలగించారు. ఆమెను ఐసీయూలో  ఉంచి చికిత్స అందిస్తున్నారు.


ఆమె పూర్తి స్థాయిలో కోలుకోలేదని బంధువులు చెబుతున్నారు. ఈ విషయం డాక్టర్లకు చెప్పి నా ఏమి కాదు కోలుకుంటుందని చెప్పారని రాధా భర్త రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రాధ ఆసుపత్రిలో మరణించింది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పగా ఆమె కు టుంబ సభ్యులు  షాక్‌కు గురయ్యారు. ఆవేశం, ఆవేదన తో డాక్టర్ల తీరుపై మండిపడ్డారు. డాక్టర్లే చంపారంటూ భర్తతో పాటు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దాదాపు 4 గంటలు పాటు అక్కడ ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. మృతురాలికి నలుగురు కుమారులు  ఉన్నారు. అందరూ 10 ఏళ్లలోపు వారే. ఇందులో 2 ఏళ్ల బాలుడు ఉన్నారు.  సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఆందోళనకారులకు నచ్చచెప్పారు. కేసు పెడితే తగిన చర్యలు తీసుకుం టామని వారికి హామీ ఇచ్చారు, ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు మాట్లాడుతూ తాము అవసరమైన చికిత్స అందించామని అయితే బీపీ పెరగడంతో గుండెపోటు వచ్చి ఆమె కోలుకోలేక మృతి చెందిందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-27T08:16:02+05:30 IST