Abn logo
Sep 19 2021 @ 09:28AM

పార్కింగ్ స్టాండ్‌లో పసిపాపను మరచిపోయిన కుటుంబ సభ్యులు... 160 కిలోమీటర్ల దూరం వెళ్లాక...

జైసల్మేర్: పిల్లలను పర్యాటక ప్రాంతాలకు తీసుకు వెళ్లేవారు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించే ఘటన రాజస్థాన్‌లోని రామ్‌దేవరాలో చోటుచేసుకుంది. ఇక్కడి పార్కింగ్ స్టాండ్‌లో రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ స్థానికులకు కనిపించింది. మూడు గంటల తరువాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే నాగౌర్ పరిధిలోని సింఘడ్ గ్రామం నుంచి బాబా రామ్ దేవ్ సమాధిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులెవరో తమ రెండేళ్ల చిన్నారిని పార్కింగ్ స్టాండ్ వద్ద ఉంచి, ఆ సంగతి మరిచి ఇంటికి వెళ్లిపోయారు.

పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు భోమ్ సింగ్ ఏడుస్తున్న ఆ పసిపాపను గమనించారు. ఆ పాప కుటుంబీకుల కోసం చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పసిపాప తండ్రి బజరంగ్ కుటుంబంతో సహా రామ్ దేవరాసందర్శనకు వచ్చి... అక్కడ పాపను మరచిపోయి వెళ్లిపోయారు. 160 కిలోమీటర్ల దూరం వెళ్లాక పాపను మరచిపోయిన సంగతి వారికి గుర్తుకు వచ్చింది. వెంటనేవారు పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులకు ఫోన్ చేసి విషయం  చెప్పారు. దీంతో భోమ్ సింగ్... పాప క్షేమంగానే ఉన్నదని తెలిపారు. వెంటనే వారు తిరికి రామ్ దేవరాకు వచ్చి పాపను తమతో పాటు తీసుకు వెళ్లారు. పాపను జాగ్రత్తగా చూసుకున్నందుకు భోమ్ సింగ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...