Shok: అయ్యో రామా.. పెళ్లిలో ఇలాంటి సంప్రదాయం కూడా ఉంటుందా.. Viral అవుతున్న Video..

ABN , First Publish Date - 2021-10-10T02:30:34+05:30 IST

ఓ పెళ్లి కార్యక్రమంలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ అయింది. అయితే ఇక్కడ వెరైటీగా జరిగిన సందర్భాన్ని చూసి బంధువులంతా పగలబడి నవ్వుకున్నారు.

Shok: అయ్యో రామా..  పెళ్లిలో ఇలాంటి సంప్రదాయం కూడా ఉంటుందా.. Viral అవుతున్న Video..

పెళ్లిళ్లు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో శుభకార్యాల సమయంలో పాటించే సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి. ఏది ఏమైనా అంతిమంగా పెళ్లి వేడుక సందడి.. సందడిగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎక్కడెక్కడో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి.  పెళ్లి మండపం మీదకు వరుడు, వధువును ఎత్తుకురావడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇలాగే ఓ పెళ్లి కార్యక్రమంలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ అయింది. అయితే ఇక్కడ వెరైటీగా జరిగిన సందర్భాన్ని చూసి బంధువులంతా పగలబడి నవ్వుకున్నారు.


పెళ్లి దుస్తుల్లో ఉన్న వధూవరులు.. మరోవైపు బంధువుల సందడి.. ఈలోగా ఓ వ్యక్తి వచ్చి వధూవరులను ఇద్దరినీ కలిపి ఎత్తుకుంటాడు. వారి ఆచారంలో భాగంగా పైకి ఎత్తుకున్నతర్వాత.. వధువు తన చేతిలోని బియ్యాన్ని వెదజల్లాలి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి కిందకు దించేయడంతో ఒక్కసారిగా ఇద్దరూ బోర్లాపడిపోతారు. ఇది చూసి పక్కనున్న వారంతా నవ్వును ఆపుకోలేకపోయారు. తర్వాత వచ్చి ఇద్దరినీ పైకి లేపుతారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.



Updated Date - 2021-10-10T02:30:34+05:30 IST