Jul 24 2021 @ 13:59PM

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ముగ్గురు మొనగాళ్లు'

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ముగ్గురు మొనగాళ్లు'. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఇందులో శ్రీనివాస్‌ రెడ్డితో పాటు దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిలో ఒకరికి కనిపించదు.. మరొకరికి వినిపించదు.. ఇంకొకరు మూగ. ఈ ముగ్గురు దివ్యాంగుల జీవితంలో ఊహించని విధంగా క్రైమ్ చోటు చేసుకుంటే, ఆ తర్వాత ఎలాంటి పరిణమాలు చోటు చేసుకున్నాయి అనే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు నిర్మించిన ఈ మూవీని ఆగస్ట్ 6న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు వెల్లడించారు. త్విష్‌ శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్‌ రవి, బద్రం, సూర్య, జబర్తస్త్‌ సన్నీ తదితరులు నటించిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.