‘నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి’

ABN , First Publish Date - 2021-07-20T17:34:23+05:30 IST

ప్రభుత్వం తక్షణమే నూతన జాబ్‌ క్యాలెండర్‌ను..

‘నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి’

అనకాపల్లిటౌన్‌: ప్రభుత్వం తక్షణమే నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బీటీ దొర డిమాండ్‌ చేశారు. సోమవారం దొడ్డి రామునాయుడు భవనంలో జరిగిన  సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత శాంతి యుతంగా ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని ప్రయ త్నించగా పోలీసులు అడ్డగించడం విచారకరమన్నారు. జి.తరుణ్‌, చంద్రశేఖర్‌, ధన తదితరులు పాల్గొన్నారు. 


పోలీస్‌ నిర్బంధాలపై  ఉద్యమించాలి

ప్రజా ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలం భిస్తున్న పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామి కవాదులంతా ఉద్యమించాలని సీపీఎం నియోజకవర్గ కన్వీనర్‌ బాలకృష్ణ కోరారు. కార్మిక కర్షక నిలయంలో మాట్లాడారు. అజయ్‌కుమార్‌, శంకరరావు, పాల్గొన్నారు. 


అరెస్టులు అన్యాయం

తుమ్మపాల: నిరుద్యోగులను అరెస్టు చేయడం దారు ణమని సీపీఐ నేత రాజాన దొరబాబు ఆరోపించారు. తక్షణమే కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంతో పాటు, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-07-20T17:34:23+05:30 IST