Abn logo
Sep 22 2020 @ 03:02AM

పులిచింతలకు 2,70,000 క్యూసెక్కుల నీటి విడుదల

రెంటచింతల, సెప్టెంబరు 21: నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు చెందిన 17 గేట్ల నుంచి 2,30,000 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు. సాగర్‌లోని యూనిట్ల ద్వారా 30,000, క్రస్ట్‌ గేట్ల ద్వారా 2,34,000 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుందన్నారు.


13 గేట్లను 2.55 మీటర్లు, నాలుగు గేట్లను 3.0 మీటర్ల మేర ఎత్తామన్నారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 247.77 అడుగులు కాగా ప్రస్తుతం 244.09(6.353 టీఎంసీలు) అడుగుల మేర నీరు ఉంది.


Advertisement
Advertisement
Advertisement