తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ABN , First Publish Date - 2021-10-31T16:48:28+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‎ విడుదల అయింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‎ విడుదల అయింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‎ను విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. నవంబర్ 9వ తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 16, నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ, నవంబర్ 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారు.



Updated Date - 2021-10-31T16:48:28+05:30 IST