Abn logo
Sep 23 2021 @ 00:43AM

సమ్మె పోస్టర్లు విడుదల

వాల్‌ పోస్టర్లను విడుదల చేస్తున్న రాష్ట్ర నాయకురాలు కీర్తి

హిందూపురం, సెప్టెంబరు 22: స్కీమ్‌ వర్కర్స్‌ ఐక్యవేదిక పిలుపు మేరకు ఈనెల 24న తలపెట్టిన అభిల భారత సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ ఎస్‌డబ్ల్యూఎ్‌ఫఐ రాష్ట్ర నాయకురాలు కీర్తి అన్నారు. సమ్మెకు సంబంధించిన గోడ పత్రికను పరిగి మండలం కొడిగెనహళ్లిలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుతోపాటు ఈఎ్‌సఐ. పీఎఫ్‌ సౌకర్యాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో ఆశవర్కర్లు పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు.