నేపాల్‌లో తెరిచిన గేట్లు.. యూపీలో నీట మునిగిన గ్రామాలు

ABN , First Publish Date - 2020-08-02T21:37:50+05:30 IST

నేపాల్ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని మూడు బ్యారేజ్‌ల నుంచి దిగువకు వదిలారు. దీంతో బహ్రాయిచ్ జిల్లాలోని 61 గ్రామాలు నీట మునిగిపోయాయి. ఏడు గ్రామాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 131 కుచా ఇళ్ళు దెబ్బతిన్నాయి

నేపాల్‌లో తెరిచిన గేట్లు.. యూపీలో నీట మునిగిన గ్రామాలు

లఖ్‌నవూ: నేపాల్‌లోని మూడు మూడు బ్యారేజ్‌ల గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బహ్రాయిచ్ జిల్లాలో ఉన్న 61 గ్రామాలు నీట మునిగిపోయాయని జిల్లా అధికారులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల్లోని సుమారు 1.50 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 171 ఇళ్లు ధ్వంసమయ్యాయని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పేర్కొంది.


‘‘నేపాల్ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని మూడు బ్యారేజ్‌ల నుంచి దిగువకు వదిలారు. దీంతో బహ్రాయిచ్ జిల్లాలోని 61 గ్రామాలు నీట మునిగిపోయాయి. ఏడు గ్రామాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 131 కుచా ఇళ్ళు దెబ్బతిన్నాయి. విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు 32 ఫ్లడ్ పోస్ట్‌లు ఏర్పాటు అయ్యాయి. ఇవి కాకుండా ఒక మోటర్ బోట్, 179 పడవలు, ఒక ప్లాటూన్ వరద పిఎసిలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలో ఉంది. జిల్లా యంత్రాంగం కూడా చురుగ్గా పని చేస్తోంది’’ అని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జై చంద్ర పాండే అన్నారు.

Updated Date - 2020-08-02T21:37:50+05:30 IST