వి.వి.ని వెంటనే విడుదల చేయండి!

ABN , First Publish Date - 2020-06-03T09:09:10+05:30 IST

గత పద్దెనిమిది నెలలుగా అసత్య ఆరోపణలతో ముంబై జైళ్లలో బంధించబడిన 81యేండ్ల ప్రముఖ కవి, రచయిత, మేధావి, పౌరహక్కుల నాయకుడు వరవరరావు ఆరోగ్య పరిస్థితి బాగా లేదు...

వి.వి.ని వెంటనే విడుదల చేయండి!

గత పద్దెనిమిది నెలలుగా అసత్య ఆరోపణలతో ముంబై జైళ్లలో బంధించబడిన 81యేండ్ల ప్రముఖ కవి, రచయిత, మేధావి, పౌరహక్కుల నాయకుడు వరవరరావు ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. ఈ పద్దెనిమిది నెలలుగా ఆయన ఎటువంటి విచారణ లేకుండా జైలులో మగ్గిపోతున్నారు. ఇంతకుముందు నుంచే ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైలులో మరిన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో కూడా ఆయనతో ఆయన సహచరి హేమలత గానీ, ఆయన కూతుళ్లు గానీ కనీసం మాట్లాడే వీలు లేకపోవడం దురదృష్టకరం. ఆయనతోపాటు భీమాకోరేగావ్ సంఘటనలో అరెస్టు చేయబడి జైలులో మగ్గుతున్న మరో పదకొండుమంది మేధావులు, పౌరహక్కుల కార్యకర్తలు, రచయితలతోపాటు, తప్పుడు కేసుల్లో జీవిత ఖైదు విధించబడ్డ వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను కూడా మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతున్నాం. వారి ప్రాణాలకు ఎలాంటి హానీ కలగకూడదన్నదే మా ఆకాంక్ష. 


డా. మొహమ్మెద్ జమీల్, పన్నబట్ర, రామకృష్ణ జల్ల (అమెరికన్ భారతీయుల సమాఖ్య), డా.రేహాన్ ఖాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీస్ అండ్ జస్టిస్), రాజు రాజగోపాల్ (హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, అమెరికా), నారాయణస్వామి వెంకటయోగి (కవి), సాజీ గోపాల్ (మానవ హక్కుల కార్యకర్త), 

డా. మొహమ్మెద్ హరూన్ (హ్యూమనిజం ప్రాజెక్ట్, ఆస్ట్రేలియా).

Updated Date - 2020-06-03T09:09:10+05:30 IST