జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: ఫైనల్ పోలింగ్ శాతమిదే..

ABN , First Publish Date - 2020-12-02T22:39:51+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: ఫైనల్ పోలింగ్ శాతమిదే..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: ఫైనల్ పోలింగ్ శాతమిదే..

హైదరాబాద్: మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ పోలింగ్‌పై సోషల్ మీడియాలో అనేక మంది విమర్శలు గుప్పించారు. ఓటర్లెవరూ పోలింగ్ బూత్‌లకు రావడం లేదని, ఓట్లేయని వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేయాలని సీపీ సజ్జనార్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈరోజు తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు విమర్శకుల నోళ్లు మూయించాయి. గత ఎన్నికలు, అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన ఎన్నికల్లోనే అత్యధిక పోలింగ్ నమోదైంది.


150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 149 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. బుధవారం తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈసారి ఎన్నికల్లో 46.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కంబన్‌బాగ్ డివిజన్‌లో 70.39 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యూసుఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2009, 2016లలో జరిగిన ఎన్నికల్లో ఇంతకంటే తక్కువ పోలింగ్ నమోదైంది. 2009 ఎన్నికల్లో 42.04 శాతం పోలింగ్ నమోదు కాగా, 2016 ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది.

Updated Date - 2020-12-02T22:39:51+05:30 IST