ఐఫోన్‌ 13 ఆగయా..

ABN , First Publish Date - 2021-09-15T08:45:18+05:30 IST

టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌.. ఐపాడ్‌ 2021, ఐపాడ్‌ మినీ, యాపిల్‌ వాచ్‌ సీరీస్‌ 7, ఐఫోన్‌ 13 అన్నింటినీ ఒకేసారి విడుదల చేసింది.

ఐఫోన్‌ 13 ఆగయా..

  • 4 మోడళ్లలో విడుదల..
  • ఐపాడ్‌, వాచ్‌ సిరీస్‌ కూడా..
  • ఈ నెలలోనే భారత మార్కెట్లోకి..


టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌.. ఐపాడ్‌ 2021, ఐపాడ్‌ మినీ, యాపిల్‌ వాచ్‌ సీరీస్‌ 7, ఐఫోన్‌ 13 అన్నింటినీ ఒకేసారి విడుదల చేసింది. కాలిఫోర్నియా స్ర్టీమింగ్‌ పేరిట జరిగిన కార్యక్రమంలో యాపిల్‌ చీఫ్‌ టిమ్‌ కుక్‌ వాటిని మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. తొమ్మిదో తరం కొత్త ఐపాడ్‌ 2021కు ఎ 13 బయోనిక్‌ చిప్‌సెట్‌ అమర్చారు. అలాగే ఎల్‌టీఈ, వైఫై సదుపాయాలు కూడా ఉంటాయి. ఐపాడ్‌ మినీ.. కొత్తగా ఊదా రంగులో 8.3 అంగుళాల స్ర్కీన్‌, 64 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం గల ఐపాడ్‌ ప్రారంభ ధర భారత మార్కెట్లో రూ.30,900గా ప్రకటించారు. వైఫై, సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.42,900. ప్రత్యేకంగా మరో రూ.13,900 ధరకి ఐపాడ్‌కి స్మార్ట్‌ కీబోర్డ్‌, రూ.3500 ధరకి స్మార్ట్‌ కవర్‌ కూడా పొందవచ్చు. స్మార్ట్‌ కవర్లు నలుపు, తెలుపు, ఇంగ్లీష్‌ లావెండర్‌ రంగుల్లో ఉంటాయి.


యాపిల్‌ వాచ్‌ సీరీస్‌ 7:  ఇదే కార్యక్రమంలో విడుదలైన మరో గాడ్జెట్‌ యాపిల్‌ వాచ్‌ సీరీస్‌ 7. మరింత పెద్ద డిస్‌ప్లే గల ఈ వాచీలు ఈ ఏడాది చివరిలో మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి. వీటి ధర 399 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. పాత వాచీలతో పోల్చితే ఇవి 40 శాతం పలుచగా ఉంటాయి. మరింత వేగంగా చార్జింగ్‌ అవుతాయి. 


యాపిల్‌ ఐఫోన్‌ 13: యాపిల్‌ ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13ప్రో మాక్స్‌, ఐఫోన్‌ 13మినీ పేర్లతో 5జీ హ్యాండ్‌సెట్లు కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ముందుగా ఊహించినట్టుగానే ఇవి భిన్నమైన లేఔట్‌ కలిగి ఉన్నాయి. పాత వెర్షన్లతో పోల్చితే మరింత పెద్ద బ్యాటరీ, 3 ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో కూడిన అల్ర్టా వైడ్‌ కెమెరా వీటి ప్రత్యేక ఆకర్షణలు. ఇందులో కూడా ఊదా రంగు కొత్త ఆకర్షణ. ఇది కాకుండా మరో మూడు రంగుల్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఐఫోన్‌ 13 ప్రో 120 హెచ్‌జడ్‌ డైనమిక్‌ రిఫ్రెష్‌ రేటుతో అందుబాటులోకి వచ్చింది. యాపిల్‌ కంపెనీ దీన్ని ‘ప్రో మోషన్‌ అడాప్టివ్‌ రిఫ్రెష్‌ రేట్‌’గా వ్యవహరించింది. ఐఫోన్‌ 13 ప్రో ధర 999 డాలర్లు కాగా ప్రోమాక్స్‌ ధర 1,099 డాలర్లు. 


భారత మార్కెట్‌ ధరలు (రూ.లలో)


ఐపాడ్‌ మినీ: వైఫై: 46,900, 

వైఫై ప్లస్‌: 60,900

ఐపాడ్‌ (9వ తరం): వైఫై: 30,900

వైఫై ప్లస్‌: 42,900

 

128జిబి దరలు

ఐఫోన్‌ 13 మినీ: 69,900

ఐఫోన్‌ 13: 79,900

ఐఫోన్‌ 13ప్రో: 1,19,900

ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌: 1,29,900

ఐఫోన్‌ 13 అన్ని మోడళ్ల బుకింగ్‌ ఈనెల 17న ప్రారంభం కానుంది. 24 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. 

Updated Date - 2021-09-15T08:45:18+05:30 IST